డిగ్రీ, పీజీలలో ఇక అటెండెన్స్ కు 10 మార్కులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : ఉన్నత విద్యలో నిరంతరం సమగ్ర మూల్యాంకనం అమలులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థుల అటెండెన్స్ కు ఇక నుండి 10 మార్కులు కేటాయిస్తున్నట్లు ఉన్నత విద్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు రాష్ట్రంలోని సంప్రదాయ వర్సిటీలకు లేఖ రాసింది. యూనవర్శిటీలు తాము సూచించిన విధానంతో పాటు సొంతంగా సంస్కరణలను అమలు చేసుకొనే స్వేచ్ఛను యూనివర్సిటీలకు ఇచ్చింది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) సిఫారసులను పరిగణనలోకి తీసుకొని అటెండెన్స్ కు 10 మార్కులు, సెమిస్టర్ లో నాలుగు ఇంటర్నల్ పరీక్షలు వంటి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఒక్కో సెమిస్టర్ లో 4 ఇంటర్నల్స్ ఎగ్జామ్స్, 60 మార్కులకు సెమిస్టర్ పరీక్షలు, మరో 40 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి.

90 రోజుల కాలవ్యవధి సెమిస్టర్ లోని అన్ని తరగతులకు హాజరైతే 10 మార్కులిస్తారు. అంతకన్నా తక్కువ క్లాసులకు హాజరైతే 9, 8 మార్కుల చొప్పున ఇస్తారు.