హైదరాబాద్ (అక్టోబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(TS GENCO RECRUITMENT 2023)లో 339 అసిస్టెంట్ ఇంజనీర్(AE), 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.
కేటగిరీల వారీగా ఖాళీలు (399)
- ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులు 187,
- ఏఈ(మెకానికల్) పోస్టులు 77,
- ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 25,
- ఏఈ(సివిల్) పోస్టులు 50.
- కెమిస్ట్ – 60 పోస్టులు
అర్హతలు
సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగినVఅభ్యర్థులు ఏఈ పోస్టులకు అర్హులు కాగా, కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రథమ శ్రేణి ఎంఎస్సీ డిగ్రీ కలిగిన వారు కెమిస్ట్ పోస్టులకు అర్హులు కానున్నారు.