INTERNATIONAL TEACHERS DAY : ఉపాధ్యాయ దినోత్సవం

BIKKI NEWS (OCT – 05) :అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (INTERNATIONAL TEACHERS DAY), ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి యునెస్కో (UNESCO) నిర్వహిస్తుంది.

TEACHERS DAY THEME 2023

“The teachers we need for the education we want: The global imperative to reverse the teacher shortage”

అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (UNESCO) 1966 సెప్టెంబర్‌ 21 నుండి 15 రోజుల పాటు పారిస్‌లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది.

‘status of the teachers’ పత్రాన్ని ఆమోదించిన అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతిఏటా సమీక్షించాలని నిర్ణయించింది.