CONSTABLE JOBS : అటెస్టేషన్ ఫామ్ ఎలా నింపాలి.?

హైదరాబాద్ (అక్టోబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB POLICE CONSTABLE ATTESTATION FORM) వెల్లడించిన ప్రకారం తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో అటెస్టేషన్ ఫారం తీసుకోవాలి. టీఎస్ఎల్ఫీఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్లో ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి.

వీటిని డిజిటల్ గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో మూడు సెట్లు ప్రింట్లు ఏ4 సైజు పేపర్ పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి.

ఇలాతీసుకున్న మూడు సెట్లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి ఈనెల 12, 13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి.

సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు ఈనెల 12న ఎస్పీ/ కమిషనర్ కార్యాలయాల్లో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్, మెకానిక్, ట్రాన్స్పోర్టు (హెచ్) కానిస్టేబుళ్లు ఈనెల 13న హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో,

మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో అటెస్టేషన్ ఫారంలు సమర్పించాలి.

వెబ్సైట్ : https://www.tslprb.in/

లాగిన్ లింక్ : https://www.tslprb.in/account/login