BIKKI NEWS (ఆగస్టు – 16) : SULABH INTERNATIONAL SERVICE ORGANIZATION వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ #BindeshwarPathak గుండెపోటుతో మరణించారు. పబ్లిక్ టాయిలెట్స్ దేశవ్యాప్తంగా నిర్మించడంతో ఇతనికి TOILET MAN OF INDIA అనే బిరుదు కలదు.
బహిరంగ మలమూత్ర విసర్జన నుండి భారత్ కు విముక్తి కల్పించాలని ఉద్దేశంతో 1970లోనే సులబ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రభుత్వాల కంటే ముందే పరిశుభ్రతపై పబ్లిక్ టాయిలెట్ (సులభ్ కాంప్లెక్స్) నిర్మించి ప్రజలకు పాఠాలు నేర్పిన వ్యక్తి బీహార్ కు చెందిన బిందేశ్వర్ పాఠక్.
తన స్వచ్చంగా సంస్థతో దేశవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. నేడు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో కొన్ని కోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా 1749 పట్టణాలలో 13 లక్షల గృహలలో టాయిలెట్స్ మరియు 5.4 కోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని ఇప్పటివరకు చేపట్టారు.
◆ బిందేశ్వర్ పాఠక్ – అవార్డులు
1991 లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే దుబాయ్ ప్రభుత్వం నుండి ఎనర్జీ గ్లోబల్ అవార్డును అందుకున్నారు. అలాగే ఫ్రెంచ్ సెనెట్ నుండి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డును అందుకున్నారు.