Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 01 – 2025

BIKKI NEWS (JAN. 08) : TODAY NEWS IN TELUGU on 8th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th JANUARY 2025

TELANGANA NEWS

సంక్రాంతి సెలవులు ప్రకటన, పాఠశాలలకు జనవరి 11 – 17 వరకు, ఇంటర్మీడియట్ కళాశాలలకు జనవరి 11 – 16 వరకు.

ఫ్యూచర్‌ సిటీ, శామీర్‌పేట, మేడ్చల్‌ మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌లను మార్చి నెలాఖరులోగా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అలోక్‌ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్న కమిషనరేట్‌.

యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై మంగళవారం దాడికి ప్రయత్నించారు

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.

మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం జనవరి 16న విచారణకు రావాలని మరోసారి నోటీసులిచ్చారు.

ప్రాథమిక కీపై అభ్యంతరాలకూ ఫీజు వసూలు – ఉన్నతవిద్యా మండలి ఆలోచన

అల్వాల్‌ టిమ్స్‌ దవాఖాన నిర్మాణం పనులు ఆగస్టు 31నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ఈనెల పదో తేదీ నుంచి ప్రైవేట్‌ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్‌వర్క్స్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు

తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న చ‌లి.. రాబోయే ఐదు రోజులు జ‌ర జాగ్ర‌త్త‌..

ANDHRA PRADESH NEWS

నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, పలు పనులకు శంకుస్థాపన.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ.

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పెళ్లి, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను ఆయన టీమ్‌ ఖండించింది.

గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లొస్తుండగా ఇద్దరు అభిమానులు మరణించించడానికి గత ప్రభుత్వమే కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణి మరోసారి మండిపడ్డారు.

NATIONAL NEWS

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరుగుతుంది. 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.

ఫిబ్రవరి 5న యూపీ, తమిళనాడులో ఉప ఎన్నికలు

మరో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌.. భారత్‌లో క్రమంగా పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు

కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు ఆర్టీఐ కమిషనర్లను నియమించడంలో తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

డిమాండ్ల సాధనకు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ఈ నెల 26న రిపబ్లిక్‌ డే నాడు దేశవ్యాప్తంగా ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్‌ మంగళవారం నిర్ణయించింది.

INTERNATIONAL NEWS

టిబెట్‌-నేపాల్‌ సరిహద్దుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఈ దుర్ఘటనలో 126 మంది ప్రాణాలు కోల్పోగా, 188 మంది గాయపడ్డారు.

కెనడా ప్రధాని రేసులో అనితా ఆనంద్‌

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పాస్‌పోర్టు రద్దయ్యింది. ఆమెతోపాటు మొత్తం 97 మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రకటన.

BUSINESS NEWS

సెన్సెక్స్‌ చివరకు 234.12 పాయింట్లు ఎగబాకి 78,199.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91.85 పాయింట్లు అందుకొని 23,707.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితంకానున్నదని కేంద్ర ప్రభుత్వ నివేదిక

2025కిగాను ఫోర్బ్స్‌ మాగ్యజైన్‌ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో భారత్ లో తొలి స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారని పేర్కొంది.

మైక్రోసాఫ్ట్‌..భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధస్సును విస్తరించడానికి 3 బిలియన్‌ డాలర్లు(రూ.25 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు.

SPORTS NEWS

భారత అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా మాజీ అథ్లెట్‌ బహదూర్‌ సింగ్‌ సాగూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీమ్‌ఇండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా గతేడాది డిసెంబర్‌ నెలకు గాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ రేసులో నిలిచాడు.

EDUCATION & JOBS UPDATS

GATE 2025 ADMIT CARDS విడుదల

ENTERTAINMENT UPDATES

బహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప 2

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు