TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 09 – 2024

BIKKI NEWS (SEP. 03) : TODAY NEWS IN TELUGU on 3rd SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd SEPTEMBER 2024

TELANGANA NEWS

ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతా వరణ శాఖ తెలిపింది.

నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సీఎస్‌

వరద బాధితులకు తక్షణ సహా యం కింద ప్రతి కుటుంబానికి రూ.10వేలు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పశువులకు 50 వేలు,గొర్రెలు, మేకలకు 5వేలు, పంట నష్టం ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలున్నా.. కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.. ధ్వజమెత్తిన కేటీఆర్‌

మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్

వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడటానికి కనీసం హెలికాఫ్టర్‌ తెప్పించలేని అసమర్థులు మన ముఖ్యమంత్రి, మంత్రులు అంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విరుచుకుపడ్డారు.

‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ఖాన్‌ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్‌ కొనియాడారు. ఆయనకు ఫోన్‌చేసి అభినందించినట్టు సోమవారం ఎక్స్‌ వేదికగా తెలిపారు

ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గత నెల 29న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరైన సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.

మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం, మోకిలలోని విల్లాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 200 విల్లాలు ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీ హౌసింగ్‌ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీరు వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. ఏపీ, తెలంగాణ మధ్య 560 బస్సులు రద్దు చేసిన టీజీఎస్‌ఆర్టీసీ

ANDHRA PRADESH NEWS

ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతా వరణ శాఖ తెలిపింది.

ఏపీ కృష్ణా జిల్లాలో మహిళా కళాశాల వాష్‌రూమ్‌, కర్ణాటకలోని బెంగళూరు తినుబండారం షాపులో రహస్య కెమెరాలు ఉన్నట్టు వెలుగుచూసిన ఘటనలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటాగా స్వీకరించింది.

వరదలో కొట్టుకుపోయిన బోట్లు.. ప్రకాశం బ్యారేజి గేట్లకు ఢీ

NATIONAL NEWS

క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్‌ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది.

మహిళలపై రేప్‌, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత మహిళా & శిశు బిల్లు’ను పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు సోమవారం తెలిపాయి.

సీబీఐ అధికారులపై శాఖాపరమైన చర్యలకు.. 82 కేసులు పెండింగ్‌

రూ.14వేల కోట్లతో ఏడు వ్యవసాయ పథకాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌..

ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు మృతులు వాళ్లే: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడని వ్యక్తిని ఏకాభిప్రాయంతో నియమించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.

సెబీ చీఫ్‌ మాధవి బుచ్‌పై కాంగ్రెస్‌ పార్టీ తాజా ఆరోపణలు గుప్పించింది. సెబీ చైర్‌పర్సన్‌గా ఉంటూ ఆమె లాభదాయక పదవిలో ఉన్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్‌ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకుంది.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్‌ సమీపంలోని సుంజ్వాన్‌ మిలిటరీ స్థావరం పై సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ గాయపడినట్లు అధికారులు తెలిపారు

INTERNATIONAL NEWS

కీళ్లవాతంలో ‘ఆస్టియో ఆర్థరైటిస్‌’ అనే ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపే అడ్వాన్స్‌డ్‌ లూబ్రికెంట్‌ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాము తయారుచేసిన హైడ్రోజెల్‌.. దెబ్బతిన్న మృదులాస్తి (ఎముకల్లోని గుజ్జు)ని టార్గెట్‌ చేసుకొని పనిచేస్తుందని, దానిని తిరిగి పునరుద్ధరణ చేసే విధంగా పనిచేస్తుందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది

రష్యాలో మిస్సైన హెలికాప్టర్‌ కథ విషాదాంతం.. 22 మంది మృతదేహాలు స్వాధీనం

ఓపెనింగ్‌ డే సందర్భంగా భారీ డిస్కౌంట్స్‌.. కరాచీ మాల్‌ను లూటీ చేసిన జనం.

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా పదోరోజు సోమవారం కూడా సూచీలు కదంతొక్కాయి

సెన్సెక్స్ : 82,560 (194)
నిఫ్టీ : 25,279 (43)

సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) కింద నెలకు రూ.250 చొప్పున మ్యూచువల్‌ పండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ఎంట్రీ లెవల్‌ కార్ల ధరలను తగ్గించింది. ఆల్టో కే 10, ఎస్‌-ప్రెస్సో మాడళ్ల ధరలను రూ. 6,500 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.

SPORTS NEWS

పారాలింపిక్స్‌లో భారత పారా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పలు క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటడంతో సోమవారం ఒక్కరోజే దేశానికి 8 పతకాలు దక్కాయి

బ్యాడ్మింటన్‌లో నితేశ్‌ కుమార్‌ (ఎస్‌ఎల్‌3) స్వర్ణంతో మెరవగా సుహాస్‌ యతిరాజ్‌ (ఎస్‌ఎల్‌4), తులసిమథి మురుగేశన్‌ (ఎస్‌యూ5) రజతాలు పట్టుకొచ్చారు. మనీష రామదాస్‌ (ఎస్‌యూ5) కాంస్యం గెలిచింది

జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ (ఎఫ్‌64) మరోసారి ఈటను ప్రత్యర్థులకు అందనంత దూరం విసిరి పసిడిని నిలబెట్టుకోగా డిస్కస్‌ త్రోలో కతునియా యోగేశ్‌ (ఎఫ్‌56), హైజంప్‌లో నిషాద్‌ కుమార్‌ (టీ47) సిల్వర్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు. ఆర్చరీలో యువ సంచలనం శీతల్‌ దేవి, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ ద్వయం కాంస్యం నెగ్గింది.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన కోకో గాఫ్‌ (యూఎస్‌ఏ) సైతం నాలుగో రౌండ్‌లోనే వెనుదిరిగింది.

యూఎస్ ఓపెన్ లో బోపన్న జోడీ మూడో రౌండ్‌లోనే ఓట‌మి.

పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో ప‌ట్టు బిగించింది. చివరి రోజు 143 పరుగుల దూరంలో విజయం.

EDUCATION & JOBS UPDATES

పీజీ ఫస్టియర్‌ సీట్ల భర్తీకి నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) సీట్ల కేటాయింపు ఆలస్యంకానుంది.

ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌పై వర్షాల కారణంగా షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు.

రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా వివరాలను సాంకేతిక విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది.

పాఠశాల దశలోనే ఆరో తరగతి నుంచే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లల్లో కాంపొజిట్‌ స్కిల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు