చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 29

★ దినోత్సవం

  • ప్రపంచ హృదయ దినోత్సవం
  • అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వ్యర్థాల అవగాహన దినోత్సవం

★ సంఘటనలు

1916: రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు.
1959: ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు.
1962: కలకత్తా లో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది.
1981: భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్‌కు హైజాక్ చేశారు.
2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
2009: అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది.
2011: దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార‌ ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో‌ ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

★ జననాలు

1725: రాబర్ట్ క్లైవ్, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ జనరల్‌.(మ.1774)
1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)
1901: ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).
1928: బ్రజేష్ మిశ్రా, భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, తొలి జాతీయ భద్రతా సలహాదారుడు (మ. 2012)
1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).
1943: లే’క్ వాలెన్సా, శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, మాజీ పోలెండ్ అధ్యక్షుడు.
1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.
1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016)
1970: కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
1978: ఆశా సైనీ , మోడల్, తెలుగు, తమిళ, హిందీ ,కన్నడ చిత్రాల నటి .
1985: అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది
1990: శ్రద్దా శ్రీనాథ్, భారతీయ చలనచిత్ర నటి, మోడల్.

★ మరణాలు

1913: రుడాల్ఫ్ డీజిల్, డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త
1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
2007: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
2008: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934).
2008: సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931)
2013: సత్యనారాయణ గోయెంకా, విపశ్యనా ధ్యాన గురువు.(జ.1924).
2014: పైడి తెరేష్ బాబు, కవి (జ.1963).
2017: టామ్ ఆల్టర్, హిందీ సినిమా నటుడు (జ.1950).
2020: కె.సి.శివశంకరన్, “శంకర్” గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924)