చరిత్రలో ఈరోజు జూన్ 15

★ సంఘటనలు

1215: ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, ‘మాగ్నా కార్టా ‘ మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు.
1991: రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు.
1908: కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము.
1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్.
1844: ‘ఛార్లెస్ గుడ్ ఇయర్’, రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు.
1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం.
1808: ‘జోసెఫ్ బోనపార్టె’ స్పెయిన్ కి రాజు అయ్యాడు.
1785: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
1775: అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, ‘జార్ఝి వాషింగ్టన్’ ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు.
1752: వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
1667: డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి ‘రక్త మార్పిడి’ చేసాడు.

★ జననాలు

1884: తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (మ.1958)
1897: పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని.
1916: హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2001).
1924: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000)
1939: దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు.
1974: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (మ.2014)

★ మరణాలు

1942: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
1949: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (జ.1877)
1975: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
1983: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (జ.1910)
2010: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926)