చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 02

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 02

★ దినోత్సవం

  • వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
  • జాతీయ నదీ దినోత్సవం
  • రుమటాయిడ్ అవేర్‌నెస్ డే

★ సంఘటనలు

1970: ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

★ జననాలు

1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940)
1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు
1903: గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు [మ. ?]
1913: కుంటిమద్ది శేషశర్మ, ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు
1915: కుష్వంత్ సింఘ్, రచయిత.
1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
1923 : వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.
1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.
1940: ఎస్. వి. రామారావు, తెలుగు సినీ రచయిత.
1940: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.

★ మరణాలు

1911: రావాడ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు.
1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, కవి, పండితులు.
1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
1999: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (జ.1925)
2020: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)
2020: కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944)
2023: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ. 1930)