చరిత్రలో ఈరోజు ఆగస్టు 17

◆ దినోత్సవం

  • ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం

◆ సంఘటనలు

1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
1985: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.

◆ జననాలు

1866: మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911).
1908: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
1939: మోదడుగు విజయ్‌ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
1962: మాకినీడి సూర్య భాస్కర్, ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త.
1964: ఎస్.శంకర్, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.

◆ మరణాలు

1786 : ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
1817: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు (జ.1761).
1955: సాహీతీ వి’శారద’, ఆయన ‘ప్రజావాణి’ అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
1980: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909).
1997: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925).
2007: దశరథ్‌ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).