Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th FEBRUARY 2024

1) భారత్ పై అత్యధిక అంతర్జాతీయ టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించార.?
జ : జో రూట్ (10)

2) ఒకే జట్టుపై 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు .?
జ :రవిచంద్రన్ అశ్విన్ (ఇంగ్లాండు పై)

3) 2024 ఆస్కార్ అవార్డులకు గాను భారత్ నుండి నామినేట్ అయిన డాక్యుమెంటరీ ఏది.?
జ : to kill a tiger

4) ఐక్యరాజ్యసమితి నివేదిక – 2023 ప్రకారం అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది.?
జ : మాయన్మార్

5) గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం

6) ప్రాచీన, అధునాతన యుద్ధ రీతులను మేళవించేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ ఉద్భవ్

7) అమెరికా ప్రైవేట్ సంస్థ చంద్రుడి పైకి ప్రయోగించిన ఒడిసియాస్ ల్యాండర్ లో అమర్చిన సూక్ష్మ శిల్పాలలో ఒకదానికి ఏ భారతీయుడు పేరు కూడా పెట్టారు.?
జ : గాంధీ

8) కొత్త నేర న్యాయ చట్టాలు ఎప్పటినుండి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.?
జ : జూలై 1 – 2024

9) భారతీయ భాషలను – ఇంగ్లీషును అనువదించడానికి కేంద్రం కృత్రిమ మేధా సహాయంతో అభివృద్ధి చేసిన ఏ అప్లికేషన్ ను విడుదల చేసింది.?
జ : భాషిణి

10) ఓకే అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ లో 600 పరుగులు పూర్తి చేసుకున్న ఐదవ భారత బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యశస్వి జైస్వాల్

11) ఎన్ టి పి సి దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.?
జ : విశాఖపట్నం

12) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇటీవల ప్రారంభించిన ‘వివిధత అమృత్ కౌశల్ మహోత్సవ్’ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి.?
జ : ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని చాటి చెప్పడం