Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th FEBRUARY 2024

1) రంజి ట్రోఫీ 2024 ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : హైదరాబాద్ (మేఘాలయ పై)

2) దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగా మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : బనిహల్ – ఖారీ – సంబల్ – సంగల్దాన్

3) దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగా మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని పొడవు ఎంత.?
జ : 12.77 కిలోమీటర్లు

4) దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగా మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని పేరు ఏమిటి.?
జ : T -5O

5) ఏ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, ఇది త్వరలోనే మానవులలో వ్యాపించే అవకాశం ఉందని కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : జాంబీ డీర్ డీసీజ్ (క్రోనిక్ వెస్టింగ్ డిసీజ్)

6) దేశంలోని వ్యవసాయ, అటవీ భూముల స్థితిని తెలుసుకోవడానికి ఇస్రో ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి?
జ : భువన్ పోర్టల్

7) దేశంలో 2022 – 23 నాటికి పేదరికం ఇంత శాతంగా నమోదు అయినట్లు నీతి అయోగ్ తన నివేదికలో పేర్కొంది.?
జ : 11.28%

8) భారత్ లో ప్రస్తుతం ఉన్న వృద్ధుల జనాభా (15 కోట్లు) ఏ సంవత్సరం నాటికి రెట్టింపు (34.7 కోట్లు) అవుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.?
జ : 2050

9) ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా 2023 లో ఏ కుటుంబం నిలిచింది.?
జ : యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్యన్ కుటుంబం

10) ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 2024 – 25 లో భారత జీడిపీ వృద్ధి రేటు ఎంత నమోదు అవుతుందని అంచనా వేసింది.?
జ : 7%

11) ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 2023 – 24 లో భారత జీడిపీ వృద్ధి రేటు ఎంత నమోదు అవుతుందని అంచనా వేసింది.?
జ : 7.3%

12) ప్రాన్స్ అత్యున్నత పౌర పురష్కారం ‘షెవాలి డెలా లిజియన్ డీ’హనర్” పురస్కారాన్ని ఎవరికి ఇటీవల అందజేశారు.?
జ : శశి థరూర్

13) డిజిటల్ ప్లై బై వైర్ ప్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (DFCC) సాంకేతికతను ఏ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానంలో ఉపయోగించారు ?
జ : తేజస్ – 1A

14) మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టింది.?
జ : మహారాష్ట్ర

15) ప్రాజెక్ట్ చీతా పర్యవేక్షణ కొరకు కేంద్రం వేసిన కమిటీ పేరు ఏమిటి.?
జ : రాజేష్ గోపాల్ కమిటీ

16) ప్రపంచ సామాజిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 20