హైదరాబాద్ (డిసెంబర్ – 17) : తెలంగాణ గెజిటెడ్ జూనియర్ అధ్యాపకుల సంఘం – 475 రాష్ట్ర నూతన కమిటీని (TGJLA STATE NEW COMITTEE) ఈరోజు హైదరాబాద్ లో ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ వస్కుల శ్రీనివాస్ ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లను ఇతర సంఘ బాధ్యులను ఎన్నుకొని సంఘ విధి విధానాలను కూడా రూపొందించుకోవడం జరిగింది.
475 సంఘానికి సంబంధించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఆదివారం హైదరాబాదులోని చెన్నుపాటి భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, అందే సత్యం లు ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో సంఘం ముందున్న అధ్యాపకుల సమస్యలు ఏమిటి వాటిని పరిష్కరించు కోవడానికి సంఘం అనుసరించాల్సిన వ్యూహాలు, పద్దతులు మరియు వాటిని ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్ళి వాటిని విధానపరంగా సాధించుకోవడానికి, అదేవిధంగా క్రమబద్దీకరించబడని అధ్యాపకుల క్రమబద్దీకరణకు సంఘ కృషి తదితర అంశాలపై అన్ని జిల్లాల నాయకులు రాష్ట్ర నిర్వాహక సభ్యుల సలహాలు సూచనలను సేకరించి సంఘ భవిషత్ పటిష్టత కార్యక్రమాలను తీర్మానించడం జరిగింది. అనంతరం