BIKKI NEWS (DEC. 26) : TELUGU MOVIE PERSONS MEET CM REVANTH TODAY. తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
TELUGU MOVIE PERSONS MEET CM REVANTH TODAY
తెలుగు చిత్రసీమకు సంబంధించి అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రి కోమటిరెడ్డి గారితో సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని గుర్తుచేశారు. పరిశ్రమ పురోభివృద్ధికి, ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు విషయాలను చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం.
సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం.
హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది.
దేశంలోని కాస్మోపాలిటన్ సిటీల్లో సినిమా పరిశ్రమ ఎదుగుదలకు హైదరాబాద్ బెస్ట్ సిటీ.
తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ గారు పేరుతో అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధాన కర్తగా ఉండేందుకు దిల్ రాజు గారిని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం.
తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి.
పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి.
గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి.
ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు.
తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.
సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా గారు, డీజీపీ జితేందర్ గారు, సినీ రంగానికి నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.
సినీ పరిశ్రమకు చెందిన సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, మురళీమోహన్ గారు, కే.రాఘవేందర్ రావు గారు, కొరటాల శివ గారు, వెంకటేశ్ గారు, నాగార్జున గారు, అల్లు అరవింద్ గారు, త్రివిక్రమ్ గారు. పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 12 – 2024
- TET HALL TICKETS – టెట్ హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి
- GK BITS IN TELUGU DECEMBER 27th
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27
- Manmhoan Singh – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు