TRT NOTIFICATION : టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు

హైదరాబాద్ (జూలై – 14) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) ద్వారా భర్తీ చేయడానికి పోస్టుల వారీగా ఖాళీల వివరాలను గతంలో విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ లెక్కల ప్రకారం దాదాపు 18 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ లో మరోసారి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) నిర్వహించి ఆ తర్వాత TRT నిర్వహించే అవకాశం ఉంది

ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకాల ద్వారా 9,370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇవికాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.. దీంతో మొత్తం 18,684 టీచర్ ఉద్యోగ ఖాళీలు ప్రస్తుతం కలవు.

టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.

◆ ఖాళీల వివరాలు :

స్కూల్ అసిస్టెంట్ – 2,179
SGT – 6,360
భాషా పండితులు – 669
పీఈటీ – 162

ఇది కాక పదోన్నతుల ద్వారా మరో 9,314 ఖాళీలు ఏర్పడనున్నాయి