DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th JULY 2023

1) ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద పరిశోధనల కోసం స్థాపించిన సంస్థ పేరు ఏమిటి.?
జ : xAI

2) అత్యధిక బంగారు నిల్వలు కలిగి ఉన్న దేశం ఏది.?
జ : అమెరికా

4) వార్తలు చదవడానికి ఒడిశా రాష్ట్రంలో ఓ ప్రైవేట్ టీవీ చానల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో టీవీ యాంకర్ ను రూపొందించారు. ఆ యాంకర్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : లీసా

5) లాత్వియా దేశ 11వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్వలింగ సంపర్కుడు ఎవరు.?
జ : ఎడ్గార్స్ రింకూవిక్స్

6) UEFA- యూరోపియన్ అండర్ – 21 ఛాంపియన్స్ షిప్ 2023 నో గెలుచుకున్న జట్టు ఏది.?
జ : ఇంగ్లాండ్ (స్పెయిన్ పై)

7) సికిల్ సెల్ ఎనీమియా ఎరాడికేషన్ మిషన్ – 2047 ను ప్రారంభించినది ఎవరు.?
జ : ప్రధాని నరేంద్ర మోడీ

8) భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఏర్పాటు చేయడానికి ఏ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : ఇంటెల్ మరియు డెల్

9) కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తక రచయిత ఎవరు.?
జ : అనిత భరత్ షా

10) PMJAY పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పరిధిని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచింది.?
జ : గుజరాత్

11) థాయిలాండ్ లో జరుగుతున్న 25వ ఆసియన్ ఆథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ – 2023 అధికారిక మస్కట్ ఏమిటి.?
జ : లార్డ్ హనుమాన్

12) గోల్డ్ మాన్ శాక్స్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎ సంవత్సరానికి నిలవనుంది.?
జ : 2075

13) ఫ్రాన్స్ లో నిర్వహిస్తున్న బాస్టిల్ డే అంటే ఏమిటి.?
జ : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం

14) భారత్ యూపీఐ చెల్లింపులకు లకు ఏ దేశంతో ఒప్పందం కుదిరింది.?
జ : ఫ్రాన్స్

15) మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల ప్రకటించింది.?
జ : ప్రపంచ ఆరోగ్య సంస్థ

16) తొలి అంతర్జాతీయ టెస్టులోనే సెంచరీ చేసిన ఎన్నో భారత బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించారు.?
జ : 17వ

17) టెన్నిస్ ఓపెన్ ఎరాలో అన్ సీడెడ్ గా బరిలోకి దిగి ఫైనల్ చేరిన తొలి మహిళ క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మార్కెటా వొండ్రాసోవా

18) ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2023లో 100 మీటర్ల మహిళల హార్దిల్స్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న తెలుగు క్రీడాకారిణి ఎవరు.?
జ : ఎర్రాజి జ్యోతి

19) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : జస్టిస్ నవీన్ రావు

20) 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న భూమి ఏ యుగములోకి ప్రవేశించిందని ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు.?
జ : ఆంత్రోపోసిన్ యుగం