BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులు, చేతివృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌లతో సరళమైన అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్దిదారులకు రూ. లక్ష పంపిణీ చేయనున్నారు.
జిల్లా స్థాయిలో దరఖాస్తులను జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు