PADMA AWARDS: తెలుగు పద్మాలు 2023

హైదరాబాద్ (జనవరి – 25) : కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది పద్మ విభూషణ్ 6 గురికి, పద్మభూషణ్ 9 మందికి, పద్మశ్రీ 91 మందికి ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 12 పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రానికి రెండు పద్మభూషణ్ అవార్డులు, మూడు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 7గురుకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి

పద్మభూషణ్ అందుకున్న వారిలో చిన్న జీయర్ స్వామి (భక్తి), కమలేష్ డి పాటిల్ (భక్తి) తెలంగాణ నుండి ఉన్నారు.

పద్మశ్రీ కి ఎంపికైన తెలంగాణకు చెందిన వారిలో మోదడుగు విజయ గుప్తా (సైన్స్ & ఇంజనీరింగ్), పూసలపాటి హనుమంతరావు (వైద్యం) , బి రామకృష్ణారావు (లిటిరేచర్ & ఎడ్యూకేషన్) ఉన్నారు.

పద్మశ్రీ కి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిలో ఎంఎం కీరవాణి (కళలు) , గణేష్ నాగప్ప కృష్ణార్జునగర (సైన్స్ & ఇంజనీరింగ్) , అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ & ఇంజనీరింగ్) , కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు, సంకురాత్రి చంద్రశేఖర్(సామాజిక సేవ) , సీవీ రాజు (కళలు), ప్రకాష్ చంద్రసూద్ (లిటిరేచర్ & ఎడ్యూకేషన్) ఉన్నారు.