Home > EDUCATION > NEET UG > NEET UG 2024 RANKS – తెలంగాణ నీట్ ర్యాంక్స్ – కటాఫ్ మార్కులు ఇవే

NEET UG 2024 RANKS – తెలంగాణ నీట్ ర్యాంక్స్ – కటాఫ్ మార్కులు ఇవే

BIKKI NEWS (AUG. 04) : TELANGANA NEET UG 2024 RANKS and CUT OFF MARKS. తెలంగాణ రాష్ట్ర స్థానికత కలిగిన అభ్యర్థుల నీట్ 2024 ర్యాంకులను కాళోజి నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ విడుదల చేసింది. అలాగే రిజర్వేషన్ల కేటగిరీల వారీగా మినిమం కటాఫ్ మార్కులను వెల్లడించింది.

TELANGANA NEET UG 2024 RANKS and CUT OFF MARKS.

గరిష్టంగా 711 మార్కులు కాగా 127 మార్కులు కనిష్ఠంగా ఉన్నాయి. మొత్తం 49,184 మంది విద్యార్థులతో కూడిన అర్హులైన వారి జాబితా విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి అత్యుత్తమంగా 711 మార్కులు అనురాన్ ఘోష్ సాదించాడు.

ఎంబీబీఎస్ సీట్లు 8,690

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,690 సీట్లు ఉండగా వాటిల్లో 31 ప్రభుత్వ మెడికల్ కాలే జీల్లో 3,990 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.

మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా అవి వస్తే మరో 200 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో అందుబా టులోకి రానున్నాయి.

కటాఫ్ మార్కుల వివరాలు

  • 50 పర్సంటైల్ లో OC/EWS – 162 మార్కులు
  • 45 పర్సంటైల్ లో OC – PwD – 144 మార్కులు
  • 40 పర్సంటైల్ లో BC/SC/ST – 127 మార్కులు
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/all-notifications/

NEET UG 2022 CUTOFF MARKS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు