NEET – 2022 CUT OFF MARKS

BIKKI NEWS : NEET (UG) – పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ ఆధారంగా ఏ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం… గత ఏడాది తెలుగు రాష్ట్రాలలోని వివిధ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీట్లకు కటాఫ్ మార్కులను (neet cut off marks in 2022) మీకోసం అందించడం జరుగుతుంది.

NEET – 2023 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో NEET 2022 లో వివిధ కేటగిరీలలో సీట్లు పొందిన కట్ ఆఫ్ మార్కులను ఒకసారి చూద్దాం… ఈ సారి నూతన 9 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్లు సంఖ్య పెరగడంతో కట్ ఇఫ్ మార్కులు ఇంకా తగ్గవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.

గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్‌ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్‌ సీటు వచ్చే అవకాశం ఉంది.

pic : eenadu