హైదరాబాద్ (ఫిబ్రవరి – 06) : తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.
★ ముఖ్యాంశాలు :
- గత ఎనిమిది సంవత్సరాలో సరాసరి 13.2% వార్షిక వృద్ది రేటును సాదించడం జరిగింది.
- దేశ జీడీపీ లో తెలంగాణ వాటా 4.9% గా ఉంది, జనాభా వాటా 2.9% మాత్రమే
- రాష్ట్ర తలసరి ఆదాయం 3,17,115 రూపాయలు
- వ్యవసాయ వృద్ధి రేటు 7.9%
- వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.
- నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు.
- విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు.
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు
- దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
- విద్య రంగానికి రూ. 19,093 కోట్లు
- వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు..
- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
- ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
- అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
- పంచాయతీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు
- హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు
- హోంశాఖకు రూ. 9,599 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
- పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
- రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
- రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు
- రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
- డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
- ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
- ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
- ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ. 3,210 కోట్లు
- ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
- ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
- న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
- ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు
- కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు
- జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్
- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
- దళిత బంధుకు రూ.17,700 కోట్లు
- ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
- ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు
- పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
- ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
- యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు
- స్పషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.10,348 కోట్లు
- మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు
- కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కోసం రూ. 750 కోట్లు
- సుంకేశుల ఇన్‌టెక్ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
- యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
- ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు
- ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 200 కోట్లు
- మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు