బీసీ విద్యార్థులకై “స్వదేశీ విద్యానిధి” పథకం

హైదరాబాద్ (జూలై – 28) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు మరొక పథకాన్ని ప్రారంభించింది. భారత దేశంలోని టాప్ 200 ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించే “స్వదేశీ విద్యానిధి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ పథకం ద్వారా దేశంలోని టాప్ 200 విద్యాసంస్థల్లో సీట్లు పొందిన 10,000 మంది బిసి విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్ గా చెల్లించనుంది

ఈ కార్యక్రమాన్ని 2023 – 24 విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ పథకానికి సుమారు 150 కోట్ల ఖర్చు వస్తుందని అంచనా.

ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.