జీజేసి హుస్నాబాద్ బాలికల కళాశాలలో స్వచ్ఛభారత్

హుస్నాబాద్ (ఆగస్టు – 18) : జాతీయ సేవా పథకం (N.S.S.) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీ నల్ల రామచంద్ర రెడ్డి గారు ప్రారంభించారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఐదు గ్రూపులుగా ఏర్పడి కళాశాల ప్రాంగణంలోని ముళ్ళ పొదలను, చెత్తను, మట్టిని ఏరి వేయడం జరిగింది. కాగితాలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎఫ్ చైర్మన్ శ్రీ నల్ల రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలుపుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిరంతరం పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుపుతూ ప్రజలందరూ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి. కరుణాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినది.

ఈ కార్యక్రమాల్లో కళాశాల యొక్క అధ్యాపక బృందము శ్రీ డి రవీందర్, శ్రీ ఎస్ సదానందం, శ్రీ బి లక్ష్మయ్య, శ్రీమతి ఎస్ కవిత, శ్రీమతి కే స్వరూప, శ్రీ ఏ సంపత్, శ్రీమతి జి కవిత, శ్రీమతి జీ కవిత, శ్రీ పి రాజేంద్రప్రసాద్ అధ్యాపకేతర బృందము సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి టి పద్మ, రికార్డు అసిస్టెంట్ శ్రీమతి టీ భాగ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ శ్రీ ఎస్ రాములు , ఆఫీస్ సబార్డినేట్ శ్రీమతి కే శ్వేత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.