హైదరాబాద్ (ఆగస్టు – 18) : వారసులు లేదా హక్కుదారులు బ్యాంకులలో క్లైమ్ చేసుకోకుండా ఉన్న డిపాజిట్ల (unclaimed Deposits) వివరాలను తెలుసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi) ఒక నూతన పోర్టల్ (UDGAM PORTAL ) ను ప్రారంభించింది.
Unclaimed Deposits Gate Way to Access Information పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఒక నూతన పోర్టల్ ను ప్రారంభించారు.
వివరాలను నమోదు చేయడం ద్వారా అన్ క్లైమేడ్ డిపాజిట్ ల వివరాలను తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఆ డబ్బులను వారసులు లేదా హక్కు దారులు క్లైమ్ చేసుకోవడం సులభం అవుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏడు బ్యాంకులను అన్క్లైమ్డ్ డిపాజిట్ల వివరాలను ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచినట్లు… ఈ ఏడాది అక్టోబర్ 15 కల్లా అన్ని బ్యాంకుల వివరాలను ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచుతామని శక్తికాంతా దాస్ తెలిపారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిటీ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ ఇండియా వంటి 7 బ్యాంకులలో అన్ క్లైమేడ్ డిపాజిట్ ల వివరాలు ప్రస్తుతానికి పోర్టల్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments are closed.