STAFF NURSE JOBS : 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్

విజయవాడ (సెప్టెంబర్ – 21) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 434 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి (434 staff nurse jobs recruitment in contract method in andhra pradesh) నోటిఫికేషన్ ను ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్లో భర్తీ చేయనున్నారు.

జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

★ వివరాలు

మొత్తం ఖాళీలు : 434 పోస్టులు (జోన్ I- 86, జోన్ II 220, జోన్ III- 34, జోన్ IV – 94.)

అర్హతలు : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్
ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

ఫీజు : 500/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులకు రూ.300)

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (ప్రత్యక్ష పద్దతిలో)

దరఖాస్తులను సంబంధిత జోన్ లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తు గడువు : 21.09.2023. నుండి 05.10.2023 వరకు.

వెబ్సైట్ : https://cfw.ap.nic.in/