AP JOBS : ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

ఒంగోలు (సెప్టెంబర్ – 22) : ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లలో స్టాఫ్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, మల్టీ రిహాబిలేషన్ వర్కర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ (staff nurse and physiotherapist jobs in prakasham district) చేయడానికి జిల్లా వైద్యాధికారి ప్రకటన జారీ చేశారు.

GNM, BPT, BSc NURSING అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 28వ తేదీ లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : మొత్తం 34 ఉద్యోగాలు

స్టాఫ్ నర్సులు: 26 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టు
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 07

అర్హతలు : జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ.

వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు స్టాఫ్ నర్సులకు రూ.27675., ఫిజియోథెరపిస్టు రూ.36935., మల్టీ రిహాబిలిటేషన్
వర్కరు రూ.23,494.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్
ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ (ప్రత్యక్ష పద్దతిలో)

చిరునామా : దరఖాస్తులను వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 28 – 2023.

వెబ్సైట్ : https://prakasam.ap.gov.in/