WORLD FOOD PRIZE 2023 : భారత శాస్త్రవేత్త స్వాతి నాయక్ ఎంపిక

హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : World food prize foundation అందించే నార్మన్ బోర్లాగ్ అవార్డుకు (BORLAUG’S FIELD AWARD 2023) ఒడిశా రాష్ట్రానికి చెందిన యువ శాస్త్రవేత్త స్వాతి నాయక్ (swathi naik) ఎంపికయింది. World food prize won by swathi Naik

ఈ మేరకు వరల్డ్ ప్రైజ్ ఫౌండేషన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

డాక్టర్ స్వాతి నాయక్ డిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI) కేంద్రంలో విత్తన పరిశోధన విభాగాధిపతి. స్వాతి వరిపంట సాగుచేసే చిన్న రైతులకు అందించిన సేవలకు ఈ అవార్డు ప్రకటించినట్లు వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ తెలిపింది.

హరిత విప్లవ పితామహుడు, నోబెల్ గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతను సాధించడానికి తోడ్పడే 40 ఏళ్లలోపు యువ శాస్త్రవేత్తలకు ఇస్తారు