ICC : శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు

దుబాయ్ (నవంబర్ – 11) : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (icc) శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం (srilanka cricket) తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్రంగా వ్యవహరించడంలో విపులమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సభ్యత్వ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డును పూర్తిగా రద్దుచేసి నూతన బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం వంటి చర్యల కారణంగా ఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

రద్దుకు సంబంధించి విధి విధానాలను నవంబర్ 21న జరిగే ఐసీసీ సమావేశంలో వెల్లడించనున్నారు. 2024 లో ఐసీసీ టి20 ప్రపంచ కప్ శ్రీలంకలో జరగనుంది. దాని మీద కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలమైన శ్రీలంక క్రికెట్ కు ఇది మరొక ఎదురు దెబ్బ.