Small savings Schemes interest rates 2023

హైదరాబాద్ (సెప్టెంబర్ – 30) : కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను (small savings schemes interest rates 2023) ప్రకటించింది. ఒక్క ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటును మినహా మిగిలిన అన్ని చిన్న మొత్తాల పథకాల వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది.

ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటును మాత్రం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతూ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది.

తాజా సర్క్యులర్ ప్రకారం పొదుపు డిపాజిట్స్ పై వడ్డీ రేటును 4 శాతం వద్ద, ఒక ఏడాది టర్మ్ డిపాజిట్ రేటును 6.9 శాతం వద్ద ఉంచింది. సెప్టెంబర్ తో ముగిసే త్రైమాసికంలో సైతం ఇవే రేట్లు ఉన్నాయి.

పోస్టాఫీసుల్లో లభించే ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది.

INTEREST RATES 2023

సేవింగ్ డిపాజిట్ – 4.0%
ఏడాది టర్మ్ డిపాజిట్ – 6.9%
రెండు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్ – 7.0%
ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ – 7.5%
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ – 8.2%
మంత్లీ ఇన్కమ్ అకౌంట్ – 7.4%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ – 7.7%
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ – 7.1%
కిసాన్ వికాస్ పత్ర – 7.5%
సుకన్య సమృద్ధి యోజన – 8.0%