ADMISSIONS : తెలుగు వర్సిటీ కోర్సులకు దరఖాస్తులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 30) : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24వ విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు (admissions in potti sriramulu telugu university 2023) కోరుతున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

లలిత కళారంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో ఎంఏ (జ్యోతిషం), భాషాభివృద్ధి శాఖలో ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సులలో చేరడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల కోటా కింద దరఖాస్తులను కోరుతున్నట్లు వివరించారు.

వెబ్సైట్.: https://www.pstucet.org/