SBI SO JOBS : 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : దేశ వ్యాప్తంగా తమ బ్రాంచీలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీస్ (sbi specialist cadre officer jobs recruitment 2023) ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ వివరాలు :

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 439 పోస్టులు

కేడర్: అసిస్టెంట్ మేనేజర్,డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 750/- (SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు).

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం : నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం.

ఆన్లైన్ దరఖాస్తు గడువు : 16 – నవంబర్ 2023 నుండి
06 అక్టోబర్ 2023 వరకు.

ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024 నుంచి

దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest