SAvsAUS : చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా

లక్నో (అక్టోబర్ – 12) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు లక్నో వేదికగా ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా (SAvsAUS) జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 134 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. సౌతాప్రికా విధించిన 313 పరుగుల లక్ష్య చేధనలో చతికిలపడింది. లబూషేన్ 46, స్టార్క్ 27 మినహా ఎవరు రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయింది.

అంతకుముందు సౌతాప్రికా 311/7 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ (109) పరుగులతో రాణించగా… అలాగే బవుమా 56, మార్క్రమ్ 35, క్లాసెన్ 26, డుషెన్ 26 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, మ్యాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో, ఇప్పుడు రెండో మ్యాచ్ లో సౌతాప్రికా పై ఓటమి పాలయింది. సౌతాఫ్రికా తన తొలి మ్యాచ్ లో శ్రీలంక పై, ఆస్ట్రేలియా పై విజయాలు సాదించింది.