60 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (అక్టోబర్ – 13) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ లలో అర్హత సాధించిన 60 మందిని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు (Degree lecturers regularization) జారీ అయ్యాయి.

గతంలో అర్హత కలిగిన 270 మంది కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకులు, మరియు మినిమం టైం స్కేల్ అధ్యాపకులు పదిమంది రెగ్యులర్ కాగా, ప్రస్తుతం 60 మంది రెగ్యులర్ అయ్యారు. క్రమబద్ధీకరణకు అర్హత అయిన పిహెచ్డి, నెట్, సెట్, తదితర అర్హతలు సాధించిన అభ్యర్థులు ప్రస్తుతం క్రమబద్ధీకరణ గావించబడ్డారు.