Santoor Scholarship : 24 వేల స్కాలర్షిప్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : SANTOOR WOMEN SCHOLARSHIP 2023 APPLICATION – సంతూర్ విమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం, ఇంటర్ తరువాత పై చదువులు చదవటానికి ఆర్థిక స్థోమత లేని అమ్మాయిల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా విప్రో సంస్థ (wipro cares scholarship) ఆహ్వానిస్తుంది. ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా డిగ్రీ మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 24 వేలు అందించనుంది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన బాలికలకు ఈ స్కాలర్‌షిప్ కోసం సెప్టెంబర్ 30వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, కర్ణాటక రాష్ట్రాల బాలికా విద్యార్థులకు వర్తిస్తుంది.

అర్హతలు: దరఖాస్తుదారులు తప్పక ప్రభుత్వ పాఠశాల/కాలేజ్ నుంచి 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి. పదవ తరగతి గవర్నమెంట్ పాఠశాలలో పాస్ అయి ఉండాలి.

ఏదైనా గుర్తింపు పొందిన కళాశాలలో 2023 – 24 సంవత్సరం మొదలై ఫుల్ టైం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో జాయిన్ అయి ఉండాలి. డిగ్రీ కోర్స్ కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ను నుంచి డౌన్లోడ్ చేసుకోనవచ్చు. వెబ్ సైట్ లో ఆన్లైన్లోనే అప్లై చేసుకొనవచ్చు.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 30 – 2023.

స్కాలర్ షిప్ ఎమౌంట్ : సంవత్సరానికి 24 వేలు

వెబ్సైట్ : http://www.santoorscholarships.com