BIKKI NEWS (FEB. 04) : Sahsha foundation donates for mid day meals for GJC SANGEM. సహస్ర ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు పాత్తేపు ప్రవీణ్ ఉపాధ్యక్షులు పోలేబోయిన భరత్, సభ్యులు వడ్లూరి సాయి, మంద మని, సింగం శివ, నాయిని వినయ్ గార్లు సంగెం కళాశాలకు మధ్యాహ్న భోజనానికి 7 వేల రూపాయల విరాళం అందించడంజరిగింది.
Sahsha foundation donates for mid day meals for GJC SANGEM
దీని ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ విరాళం విద్యార్థులకు పోషకాహారం అందించడానికి మరియు వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టడానికి మరియు మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంది. అని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవరావు పేర్కొన్నారు.
సహస్ర ఫౌండేషన్ చేసిన ఈ మంచి పనికి అభినందనలు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వారికి స్ఫూర్తి కలగాలని కోరుకుంటున్నాను. వీరి సేవలు సమాజానికి ఎంతో అవసరం, ఆదర్శనీయం అని కళాశాల సీనియర్ అధ్యాపకురాలు శ్రీమతి బండి విజయనిర్మల అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవరావు, అధ్యాపకురాలు బండి విజయనిర్మల, మామిండ్ల బుచ్చిరెడ్డి, పవన్ కుమార్, రాజ్ కుమార్, సుధీర్ కుమార్, కుమారస్వామి, యాకసాయిలు, అనిల్ కుమార్, చిరంజీవి, మాధవి, అక్రమ్ అలీ, కుమారస్వామి, పద్మ, రమాదేవి, సదయ్య, లక్ష్మి, సంగీత, మరియు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- TS INTER MODEL QUESTION PAPERS – 2025
- UPSC IFS 2025 NOTIFICATION – ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్
- UPSC CIVILS 2025 – సివిల్స్ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్
- ENTRANCE EXAMS – ప్రవేశ పరీక్షలకు కొత్త నిబంధన
- LAWCET 2025 NOTIFICATION – లాసెట్ నోటిఫికేషన్