REPORTS NOVEMBER 2023 – నివేదికలు

BIKKI NEWS (DEC – 03) : రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ వివిధ సంస్థలు 2023 నవంబర్ నెలలోఅందించిన నివేదికలను (REPORTS NOVEMBER 2023) పోటీ పరీక్షల నేపథ్యంలో Current Affairsలో భాగంగా ఒకే చోట చూద్దాం…

1) సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక ప్రకారం అక్టోబర్ 2023లో భారత్లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 10.05%

2) హూరున్ భారత దాతృత్వ నివేదిక 2023 ప్రకారం దాతృత్వంలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు.?
జ : శివనాడార్ అండ్ కుటుంబం

3) లుమికై సంస్థ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత్ లో డిజిటల్ గేమింగ్ పరిశ్రమ ఎన్ని వేలకోట్లకు చేరుకొనుంది.?
జ : 62 వేల కోట్లు

4) జాతీయ జ్యుడీషియల్ డెటా గ్రిడ్ ప్రకారం దేశవ్యాప్తంగా కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి.?
జ : 5.08 కోట్లు

5) గత ఏడాది కాలంలో అమెరికాలోకి అక్రమంగా చొరబాటు యత్నం చేసిన ఎంతమంది భారతీయులను అరెస్టు చేసినట్లు అమెరికా నివేదిక వెల్లడించింది.?
జ : 96,917

6) భారతదేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నట్లు కేంద్రం నివేదిక వెల్లడించింది.?
జ : తమిళనాడు

7) ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2024లో గ్లోబల్ గ్రోత్ రేట్ ఎంత శాతంగా ఉండనుంది.?
జ : 2.9%

8) భారతీయ నగర వ్యవస్థల వార్షిక సర్వే 2023 ప్రకారం 2050 నాటికి భారత్లో ఎంతమంది జనాభా పట్టణాలలో నివసించనున్నారు.?
జ : 80 కోట్లు

9) గ్లోబల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత నగరం ఏది.?
జ : ముంబై

10) 1991 – 2021 మధ్యకాలంలో వరదలు, కరువులు, భూతాపం వలన ప్రపంచవ్యాప్తంగా రైతులకు కలిగిన నష్టం ఎన్ని కోట్లు.?
జ : 3.8 లక్షల కోట్ల డాలర్లు

11) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2022 లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది టీబీ జబ్బు భారీన పడ్డారు.?
జ : 75 లక్షలు

12) కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం 2017 – 19 మద్య ఎన్ని చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురయ్యాయి.?
జ : 35 వేలు

13) క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్ 2024లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : ఐఐటి బాంబే

14) క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్ 2024లో భారత్ నుండి ఎన్ని యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 148

15) స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2023 నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది?
జ : వరల్డ్ మెటీరియల్ లాజికల్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాతావరణ సంస్థ – WMO)

16) కాగ్ నివేదిక ప్రకారం సామాజిక వ్యయం, ఆస్తుల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానాలలో నిలిచింది.?
జ : మొదటి, రెండు

17) కాగ్ నివేదిక ప్రకారం ఆస్తుల రూపకల్పనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి

18) UNDP నివేదిక ప్రకారం 2019 – 20 లో భారత్ పేదరిక శాతం ఎంత.?
జ : 15%

19) UNDP నివేదిక ప్రకారం 2020 – 22 లో భారత్ తలసరి ఆదాయం ఎంత.?
జ : 2,389 డాలర్లు

20) నాసా నివేదిక ప్రకారం 2025లో మాయమైన శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు మళ్లీ ఏ సంవత్సరంలో ప్రత్యక్షం కానున్నాయి.?
జ : 2032

21) నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ సర్వే ప్రకారం 2024లో ప్రపంచం వ్యాప్తంగా సందర్శించాల్సిన 30 కూలెస్ట్ డెస్టినేషన్స్ లో భారత్ నుండి చోటుపొందిన ఒకే ఒక ప్రాంతం ఏది.?
జ : సిక్కిం

22) సెప్టెంబర్ 28 – 2023 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరిందని ఏ సంస్థ ప్రకటించింది .?
జ : అమెరికా జనగణ సంస్థ

23) సెప్టెంబర్ 22 – 2022 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరిందని ఏ సంస్థ ప్రకటించింది .?
జ : ఐక్యరాజ్య సమితి

24) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక టీబీ (క్షయ) కేసులు ఏ దేశంలో నమోదు అవుతున్నాయి.?
జ : భారత్ (27%)

25) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 70 లక్షల మంది

26) భారత్ లో 81 కోట్ల మంది పౌరుల ఆధార్ కార్డుల గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఇటీవల ఏ సంస్థ హెచ్చరించింది.?
జ : మూడీస్

27) మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 , 2024 – 25 ఆర్థిక సంవత్సరాలలో భారత టిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.5%

28) స్విట్జర్లాండ్ కు చెందిన ఐ క్యు ఎయిర్ సంస్థ నివేదిక ప్రకారం దీపావళి మరుసటి రోజు ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన నగరం ఏది.?
జ : న్యూఢిల్లీ

29) స్టాండర్డ్ & పూర్ (S&P) సంస్థ తాజా అంచనాల ప్రకారం 2024 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6 – 7.1%

30) లాన్సెట్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 2100 నాటికి భూమి ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెంటిగ్రేట్ పెరిగే అవకాశం ఉంది.?
జ : 2.7 డిగ్రీల సెంటీ గ్రేడ్

31) ధూమపానం వలన కలిగే క్యాన్సర్ వలన ఏడు దేశాలలో సంవత్సరానికి ఎన్ని మంది మరణిస్తున్నట్లు లాన్సెట్ సంస్థ నివేదిక తెలిపింది.?
జ : 13 లక్షల మంది

32) ఫోర్బ్స్ కథనం ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యదిక తలసరి ఆదాయం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం – 5.19 లక్షలు

33) ఫోర్బ్స్ కథనం ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల తలసరి ఆదాయం ఎంత.?
జ : TS – 3.08, AP – 2.19 లక్షలు

34) గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ 2023 లో భారత్ 72 యూనికార్న్ లతో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ

35) ఇంక్లూజివ్‌నెస్ ఇండెక్స్ 2023 లో 129 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 117

36) లా లీస్టే అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 1,000 రెస్టారెంట్లలో భారత్ నుండి ఎన్ని రెస్టారెంట్లు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 10

37) లా లీస్టే అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 1,000 రెస్టారెంట్లలో తెలంగాణ నుండి చోటు సంపాదించుకున్న రెస్టారెంట్ ఏది.?
జ : ఆదా రెస్టారెంట్ (హైదరాబాద్)

38) అమెరికా దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (మెక్సికో, ఎల్ సాల్వడార్ మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి)

39) అంతు చిక్కని నిమోనియా వ్యాధితో ఏ దేశంలోని చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నట్లు ప్రోమెడ్ అనే సంస్థ హెచ్చరించింది.?
జ : చైనా

40) మహిళల చేత ప్రారంభించబడుతున్న స్టార్టప్ లు ఏ నగరంలో అత్యధికంగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.?
జ : బెంగళూరు

41) ఐక్య రాజ్యసమితి నివేదిక ప్రకారం 2005 – 2006 నుండి 2020 – 21 వరకు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కారణంగా భారత్, చైనా దేశాలు ఎంతమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేశాయి.?
జ : చైనా – 80 కోట్లు, భారత్ – 41.5 కోట్లు

42) PWC – అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో 2031 నాటికి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల సంఖ్య ఎంత ఉండనుంది.?
జ : 19.3 కోట్లు (9.8%)

43) ఐరాస నివేదిక ప్రకారం భారత్ లో 2050 నాటికి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల సంఖ్య ఎంత ఉండనుంది.?
జ : 31.9 కోట్లు

44) యూబీఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక ప్రకారం 2022 నాటికి భారతదేశంలో మిలీనియర్ల సంఖ్య ఎంత.?
జ : 8.49 లక్షల మంది

45) WEBSTER DICTIONARY ప్రకారం 2023 లో ఆన్లైన్ లో అత్యధికంగా వెతకబడిన పదం ఏమిటి.?
జ : Authentic

46) S&P సంస్థ 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటును గతంలో 6.0 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎంతగా ప్రకటించింది.?
జ : 6.4%

47) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘనంగాల ప్రకారం 2022 23 సంవత్సరంలో సైబర్ మేరగాళ్లు యూపీఐ లావాదేవీల ద్వారా ఎంత మేరా దోచుకున్నారు.?
జ : 30,252 కోట్లు

48) వాయు కాలుష్యం వలన భారత్ లో సంవత్సరానికి ఎంత మంది చనిపోతున్నారని జర్మనీ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది.?
జ : 21.8 లక్షలు

49) 2023 లో సగటు ఉష్ణోగ్రత ఎంతమేర పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.?
జ : 1.4℃

50) హూరూన్ సెల్ప్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆప్ మిలినియా జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు.?
జ : రాధాకిషన్ దమానీ

51) Forbes Asia Philanthropists 2023 జాబితాలో దాతృత్వంలో నీటిగా నిలిచిన భారతీయులు ఎవరు.?
జ : నందన్ నీలేకని, నికత్ కామత్, కెపి సింగ్