International Day of Persons with Disabilities

BIKKI NEWS (DEC 03) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities) ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా దివ్యాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం దివ్యాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరం

దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరం గా ప్రకటించింది. అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది.

ఒక బిలియన్ జనాభా దివ్యాంగులలో, 80% మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తున్నారు.

60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులలో 46% మంది వైకల్యాలున్న వ్యక్తులుగా అంచనా వేయబడింది.

ప్రతి ఐదుగురిలో ఒకరు తన జీవితంలో వైకల్యాన్ని అనుభవించే అవకాశం ఉంది, అయితే ప్రతి పది మంది పిల్లలలో ఒకరు వైకల్యం ఉన్న బిడ్డ.

THEME 2023

United in action to rescue and achieve the SDGs for, with and by persons with disabilities.

వైకల్యాలున్న వ్యక్తుల కోసం మరియు వారి ద్వారా సుస్థిరాభివృద్ది లక్ష్యాలను రక్షించడానికి మరియు సాధించడానికి చర్యలో కలిసి పని చేయడం .