APPSC – GROUP- 2 ఖాళీలు‌, సిలబస్, పరీక్ష విధానం

విజయవాడ (డిసెంబర్ – 03): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC GROUP 2 POSTS SYLLABUS EXAM PATTERN) 720 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు వ‌చ్చే వారంలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్నట్లు సమాచారం. వ‌చ్చే బుధ‌వారం అన్ని ప్ర‌భుత్వ‌శాఖ‌ల నుంచి పోస్టుల ఖాళీల వివ‌రాలను స‌మ‌ర్పిస్తాయ‌ని అనంతరం వెంటనే గ్రూప్ – 2 నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు..

★ APPSC గ్రూప్ 2 ఖాళీలు

1) ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 23
2) జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 161
3) లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 12
4) లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 10
5) MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 : 4
6) డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii) : 114
7) సబ్-రిజిస్త్రార్ : 16
8) ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్: 150
9) LFB and IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 18
10) జూనియర్ అసిస్టెంట్ పోస్టులు : 212
మొత్తం : 720

◆ APPSC Group 2 నూతన సిలబస్ & పరీక్ష విధానం

ఆంధ‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కొత్త సిల‌బ‌స్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త సిల‌బ‌స్ ప్ర‌కారం… మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.

సవరించిన సిలబస్ & పరీక్షా సరళి ప్రకారం.. 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీని మాత్రమే కలిగి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ మినహాయించబడింది. ఇది ఇప్పటికే ఉన్న స్కీమ్‌లో మూడింటికి బదులుగా ఒక్కొక్కటి 150 మార్కులకు రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది.