Home > EMPLOYEES NEWS > పాలిటెక్నిక్ లెక్చరర్లను రెగ్యులర్ చేసినందుకు కృతజ్ఞత సభ

పాలిటెక్నిక్ లెక్చరర్లను రెగ్యులర్ చేసినందుకు కృతజ్ఞత సభ

BIKKI NEWS (FEB. 04) : పాలిటెక్నిక్ లెక్చరర్లను రెగ్యులర్ చేసినందుకు కృతజ్ఞత కార్యక్రమం (regularized polytechnic lecturers geatutiy meeting) ఏర్పాటు చేసి అహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు..

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… మా ప్రభుత్వ హయాంలో పాలిటెక్నిక్ లెక్చరర్ల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మీ అందరూ నన్ను ఎన్నోసార్లు కలిసారు. మీ వినతులను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేశాను. నేను కూడా పాలిటెక్నిక్ విద్యార్థినే. నాకు ఎంతో అనుబంధం ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది.

2018లోనే రెగ్యులరైజ్ చేసి ఉంటే 412 మందిలో కేవలం 162 మంది మాత్రమే రెగ్యులర్ అయ్యేవారు. కానీ MCHRD లో మేం మీటింగ్ పెట్టి మొత్తం 390 మంది రెగ్యులర్ అయ్యేలా చేశాం. అంటే 95 శాతం పైగా చేశాం. మిగతా వారు కూడా రెగ్యులర్ అవుతారని ఆశిస్తున్నాం.

పాలిటెక్నిక్ కాలేజీలను మరింత పటిష్టం చేసేందుకు 240 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరీక్ష పూర్తి చేశాం. ఫలితాలు రానున్నాయి.

2009 నుంచి 2015 వరకు చూస్తే లెక్చరర్లకు కేవలం 10 నెలల రెన్యువల్ ఉండేది. దీనివల్ల 10 నెలల జీతం మాత్రమే వచ్చేది. మేం 12 నెలలు చేశాం. దాంతో 12 నెలల జీతం పొందుతున్నారు.

మీ బాధలు గుర్తించి, ప్రభుత్వ ఉద్యోగులకు PRC ఇవ్వకముందే, కాంట్రాక్టు లెక్చరర్లకు జీతం పెంచుతూ PRC జీవో ఇచ్చాం.

స్టేట్ స్కేల్ ప్రకారం చూస్తే రూ. 54,270 మాత్రమే వస్తుండేది, కానీ AICTC నిబంధనల మేరకు రూ. 58,850గా బేసిక్ పే ఇచ్చాము.

రెగ్యులర్ వాళ్లకు కూడా AICTC పే స్కేల్ అడగకుండానే క్లియర్ చేశాం. AICTC పే స్కేల్ నిబంధన మేరకు 2012-13 రిక్రూట్ అయిన బ్యాచ్‌కు PB- 4…13 ఏళ్ల సర్వేసుకే ఇవ్వాలి. కానీ 16 ఏళ్లు చేశారు.

సెంట్రల్ గెజిట్ వల్ల ఏమి చేయలేకపోయాం. ఈ విషయంలో మీకు అండగా ఉంటాం. పాలిటెక్నిక్ విద్యను పటిష్టం చేసేందుకు రాష్ట్రంలో 5 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశాం.

మణుగూరు, షాద్ నగర్, మహేశ్వరం, ఆమనగల్, పటాన్‌‌చెరు పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు గతంలో హాస్టళ్లు లేవు. దీంతో స్టూడెంట్ పర్సంటేజ్ తగ్గింది. మేం ఎస్సీ ఎస్టీల కోసం మొత్తం 12 హాస్టళ్లు ఏర్పాటు చేశాం. విద్యార్థుల శాతం పెరిగింది.

పిల్లలకు సన్నబియ్యంతో భోజనం అందించాం. కాలేజీల్లో ల్యాబులు దీనావస్థలో ఉంటే బాగు చేసేందుకు ఫండ్ విడుదల చేశాం.

గత ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్య బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేసింది. అదే విధంగా మీ గౌరవ అధ్యక్షునిగా పాలిటెక్నిక్ లెక్చరర్ల సంక్షేమం కోసం అండగా ఉంటానని తెలిపారు.