డిజిటల్ తరగతుల బోధనలో చరిత్ర సృష్టించిన అధ్యాపకుడు రామ్ మోహన్

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్రంలోని కరోనా కారణంగా డి డి యాదగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ తరగతులను ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. డీడీ యాదగిరిలో 100 డిజిటల్ తరగతులను బోధించిన చరిత్ర సబ్జెక్టు అధ్యాపకుడిగా రామ్ మోహన్ నిలిచారు.

హైదరాబాద్ జిల్లా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు చరిత్ర సబ్జెక్ట్ ను బోధిస్తున్న ఒప్పంద అధ్యాపకుడు డీడీ యాదగిరిలో రామ్ మోహన్ 100 కి పైగా ఇంటర్మీడియట్ చరిత్ర సబ్జెక్టు కు సంబంధించిన డిజిటల్ తరగతులు బోధించి ఎందరికో ఆదర్శంగా, ప్రేరణగా నిలిచారు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో సులభంగా అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బోధిస్తున్నారు.

ఇప్పటికే 100 క్లాసులు పూర్తి చెందిన రామ్ మోహన్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలతో కూడిన తరగతులను ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలలో బోధిస్తున్నారు.

2008 నుండి ఒప్పంద అధ్యాపకుడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల S. P. రోడ్ సికింద్రాబాద్ లో చేరిన తరువాత 2009 నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల కాచిగూడ నందు చరిత్ర అధ్యాపకుడిగా సేవలను అందిస్తున్నారు.

ప్రభుత్వజూనియర్ కళాశాలలో H.E.C గ్రూప్ ను ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఉచిత పోలీస్ శిక్షణ తరగతులకు కూడా ఉచితంగా బోధనా సేవలను కొనసాగిస్తున్నారు.

100 డిజిటల్ తరగతులను తీసుకోవడానికి ప్రధాన కారణమైన కళాశాల ప్రిన్సిపాల్ కి, కో ఆర్డినేటర్ జోత్స్న మేడంకి, మరియు తోటి అధ్యాపకులందరికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి రామ్ మోహన్ ధన్యవాదాలు తెలిపారు.

తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులు, భార్య శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు అందరి సహకారం మరువలేనిదని రామ్ మోహన్ తెలిపారు.