PM MODI : మోడీకి అత్యున్నత పౌర పురస్కారాలు అందించిన రెండు దేశాలు

హైదరాబాద్ (మే – 23) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పసిఫిక్ సముద్ర ద్వీపదేశాలైన పుపువా న్యూగినియా, ఫిజీ దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేశాయి

14 పసిఫిక్ ద్వీపదేశాల అధినేతలు పాల్గొన్న “ఇండియా – పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ శిఖరాగ్ర సదస్సు” సందర్భంగా పౌర పురష్కారాలను అందజేశారు.

పుపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబు డొడాయి ప్రధాని మోదీకి “గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో హు” పురస్కారాన్ని ప్రధారం చేశారు. ఇది భారత్ లో భారత్ రత్న తరహా పురస్కారము.

ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రభూక భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ” ని ప్రదానం చేశారు. మోడీ గ్లోబల్ లీడర్షిప్ కు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు పిజి ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఈ పురస్కారాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ ఇది భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తింపుగా బావిస్తున్నట్లు పేర్కొన్నారు.