NURSE JOBS : కెనడా, యూకేలో 35 లక్షల వేతనంతో నర్సు ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ 20) : కెనడా, యూకేలలో 50 చొప్పున నర్సు పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 25 లోపు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

యూకేలో వార్షిక వేతనం రూ.29 లక్షల నుంచి రూ.35 లక్షలు కాగా, కెనడాలో రూ.36 లక్షల నుంచి రూ 49 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులకు రెండేండ్ల ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొన్నది.

వివరాలకు 6302292450, 7893566493 నంబర్లను సంప్రదించాలని కోరింది.

APPLY HERE