మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు చర్యలు.!

హైదరాబాద్ (జూన్ – 20) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో మరో 30 మంది సర్వీస్ ను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో సుమారు 850 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తుండగా, వారిలో 270 మందిని గత నెలలో క్రమబద్ధీకరించారు. మిగిలిన వారికి నెట్, స్లెట్ లేదా పీహెచ్డీ విద్యార్హత లేదని పెండింగ్ లో ఉంచారు. వీరిలో 30 మంది ఇటీవల అవసరమైన అదనపు విద్యార్హతలు పొందటంతో వారిని క్రమబద్ధీకరించాలని కళాశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని. వారిని కూడా రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం ఇవ్వొచ్చని సమాచారం..

ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని ఒకేషనల్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో కొన్ని పోస్టులను కొత్తగా మంజూరు చేసి మరికొందరిని క్రమబద్దీకరించడంపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.