కళాశాలలో జాతీయ సేవా దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ (సెప్టెంబర్ 23) : జాతీయ సేవా దినోత్సవ వేడుకలు ముందస్తుగా శనివారం నాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర హుస్నాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరునహరి రణధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. చెట్లకొమ్మలను కత్తిరించి చెట్లకు పాదులు చేశారు. కళాశాల భవనం పై ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ లోగో రూపములో మానవహారం ప్రదర్శించారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ చైర్మన్ ఏ దేవ స్వామి వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ” విద్యార్థులు చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకోవాలని కళాశాలతో పాటు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చు అన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా లక్ష్యసాధన దిశ వైపుకు అడుగులేస్తూ దేశ సేవలో పాల్గొని ఉత్తమ పౌరులుగా నిలవాలని అన్నారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టీ.రణధీర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావం అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. విద్యార్థులు వీలైనంతవరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ మానసిక వికాసాన్ని పెంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఎస్ రాజు, చంద్రశేఖర్, రజని, సదాశివ్, సత్యనారాయణ, సాగర్ ,వెంకట ముత్యం, చంద్ర మోహన్, అశోక్, రాజిరెడ్డి, మమత, వెంకటేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.