హుస్నాబాద్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు

హుస్నాబాద్ (సెప్టెంబర్ – 23) : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ అక్షరాల రూపంలో కూర్చుని మానవహారంగా ఏర్పడి ఎన్ఎస్ఎస్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

వాలంటీలను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజంలో మంచి గుర్తింపును పొందాలన్నారు. ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలను వివరిస్తూ విద్యార్థినులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛభారత్ సాంఘిక అవగాహన ర్యాలీలో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఏర్పరచుకొని నవ సమాజాన్ని నిర్మించడంలో సరైన పాత్రని పోషించాలన్నారు

అనంతరము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సిఈడి కరుణాకర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యొక్క ఆవిర్భావము లక్ష్యాలు ఎన్ఎస్ఎస్ యొక్క ఉద్దేశాలను గురించి వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలన్నారు.

ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సిఐడి కరుణాకర్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో కళాశాల సిబ్బంది డి రవీందర్, ఎస్ సదానందం, బి. లక్ష్మయ్య, కే స్వరూప, కవిత, ఏ సంపత్, జి కవిత, నిర్మలాదేవి, పి. రాజేంద్రప్రసాద్, అధ్యాపకేతర బృందం టీ. పద్మ‌, రాములు, టీ. భాగ్యలక్ష్మి, శ్వేత మరియు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.