NON TEACHING JOBS : సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2023

BIKKI NEWS (డిసెంబర్ – 03) : దేశ వ్యాప్తంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో రెగ్యులర్/ పర్మనెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ (CURE 2023) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ వర్సిటీల్లో నాన్ టీచింగ్ నియామకాలు (Non teaching jobs in central universities) చేపడతారు.

ప్రకటన : సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ -2023 (CURE – 2023)

యూనివర్సిటీ, ఖాళీల వివరాలు:

  1. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూదిల్లీ: జూనియర్ అసిస్టెంట్- కమ్ టైపిస్ట్- 50 పోస్టులు,
    స్టెనోగ్రాఫర్- 52 పోస్టులు.
  2. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారి(బిహార్): 48 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు గడువు : (ఎంజీసీయూ/ ఇగ్నో): 21-12-2023.

ఎడిట్ ఆప్షన్: 22 నుంచి 25-12-2023 వరకు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://exams.nta.ac.in/CUREC/#