హైదరాబాద్ (జూన్ – 27) : నవోదయ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 7,629 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
జులై మొదటి వారంలో దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. రాతపరీక్ష, డెమో, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.