NMMSS : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్

హైదరాబాద్ (సెప్టెంబర్ 28) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (national means cum merit scholarship scheme 2023) నోటిఫికేషన్ విడుదలైంది. స్కాలర్షిప్ కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు నవంబర్ 30 వరకు కలదు.

2023 – 24 విద్యాసంవత్సరానికి కొత్త స్కాలర్షిప్ లతో పాటు, రెన్యూవల్ కోసం నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అర్హతలు : ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3.50 లక్షల లోపు ఉండాలి.
7వ తరగతిలో 55% మార్కులు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : 100/- (SC, ST, PH – 50/-)

ఎంపిక విధానం : అర్హత పరీక్ష ద్వారా

పరీక్ష విధానం : మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT). – 90 ప్రశ్నలు, స్కాలష్టిక్ ఎబిలిటీస్ టెస్ట్ – 90 ప్రశ్నలు

స్కాలర్‌షిప్ విలువ : 9, 10 తరగతులలో నెలకు 1,000/-చోప్పున, ఇంటర్ లో నెలకు 1,250 చొప్పున అందజేస్తారు.

ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. మరియు అకడమిక్ తరగతులలో CGPA 7.5 ను సాదించాలి.

వెబ్సైట్ : https://www.bse.telangana.gov.in/