DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th SEPTEMBER 2023
1) అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు చేసిన జట్టు ఏది.?
జ : నేపాల్ – 314 (మంగోలియా పై)
2) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు ఏది.?
జ : నేపాల్ (26)
3) భూమి మీద ఎనిమిదవ ఖండంగా ఏ ప్రాంతాన్ని గుర్తించారు.?
జ : జిలాండియా
4) ఎనిమిదవ ఖండంగా గుర్తించిన జిలాండియా ఏ మహాసముద్రంలో ఉంది.?
జ : దక్షిణ పసిఫిక్
5) ఇరాన్ తన మొట్టమొదటి ఛాయాచిత్రాలను తీసే శాటిలైట్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది్ దాని పేరు ఏమిటి?
జ : నూర్ 3
6) ఆస్కార్ నామినేషన్ బరిలోకి దిగిన భారతీయ చిత్రం ఏది.?
జ : 2018 (మలయాళీ)
7) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నూతన వైస్ చైర్మన్ గా ఎవరిని నియమించారు.?
జ : భార్గవ్ దాస్ గుప్తా
8) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన అలనాటి నటి ఎవరు.?
జ : వహీదా రెహ్మాన్
9) 2023 సెప్టెంబర్ 27 నాటికి గూగుల్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది.?
జ : 25
10) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 40 స్థానం
11) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో మొదటి, చివరి స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి.?
జ : స్విట్జర్లాండ్, అంగోలా
12) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన చేతిరాతతో రాసిన పరిశోధనా పత్రము ఇటీవల ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది.?
జ : 10.7 కోట్లు
13) ఐక్యరాజ్యసమితి జనాభా నిధి నివేదిక ప్రకారం 2021, 2036, 2050, 2౦99 నాటికి భారతదేశంలో వృద్ధుల శాతం ఎంతగా ఉండనుంది.?
జ : 10.1%, 15% & 20.8%, 36%
14) టైమ్స్ యూనివర్సిటీ ర్యాంక్ 2023 లో భారత్ నుండి అత్యుత్తమ యూనివర్సిటీ గా ఏ యూనివర్సిటీ నిలిచింది.?
జ : బెంగళూరు ఐఐఎస్‌సీ
15) ఇండియన్ రీజియన్ నావిగేషనల్ సాటిలైట్ సిస్టం (నావిక్) యొక్క పరిధిని 1500 కీమీ నుంచి ఎంతకు పెంచాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది.?
జ : 3000 కీమీ
16) తెలంగాణ రాష్ట్రంలో వర్ష కాలం 2023 సాగులో వరి పంట విస్తీర్ణం ఎన్ని లక్షల ఎకరాలకు చేరింది.?
జ : 65 లక్షల ఎకరాలు